హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దాం.
పూర్ణం కుడుములు :-
పూర్ణం కుడుములు ఇది కూడా వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం .ఇది కూడా అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నివేదిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇది బెల్లంతో చేసుకోవచ్చు.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.తప్పకుండ ట్రై చేసి టేస్ట్ చేయండి.
కావలసిన పదార్థాలు:-
బియ్యం పిండి ఒక కప్పు
బెల్లం ఒక కప్పు
నెయ్యి ఒక స్పూన్
ఒక స్పూన్ పంచదార
ఎండు కొబ్బరి తురుము
నీళ్ళు ఒక కప్పు
సెనగపప్పు ఒక కప్పు
ఇలాచి పౌడర్
తయారు చేసే విదానం:-
- పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
- స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడిచేసుకోవాలి.
- నీళ్ళు వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నునే కానీ వేసుకోవాలి.
- అలాగే మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూన్ పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు మరగాలి.
- మరిగిన తర్వాత బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి.పిండిని కలుపుతూ చపాతీ పిండిలా అయ్యే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- పిండిని చల్లార పెట్టి బాగా చేతితో మేతగా అయ్యే వరకు పిండిని కలిపి ముద్దలా చేసుకోవాలి.
- ఒక కప్పు సెనగపప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
- ఉడికిన సెనగపప్పు నీళ్లు వడ్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి.
- నీళ్లు బెల్లం తడిసెల పోసుకుంటే చాలు ఎక్కువగా పోసుకుంటే జారుడుగా అవుతుంది.
- బెల్లం కరిగిన తరువాత అందులో పొడి చేసుకొని పెట్టుకున్న సెనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- అందులో ఒక సగం చెంచా ఇలాచి పౌడర్ వేసుకోవాలి.
- ముద్దగా అయ్యే వరకు ఉడికించి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టీ చల్లారనివ్వాలి.
- సెనగపప్పు బెల్లం మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు బియ్యం పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అర చేతిలో వేసుకొని కొద్దిగా వెడల్పుగా చేసి అందులో బెల్లం సెనగపప్పు ముద్దను పెట్టీ గుండ్రంగా చుట్టి పెట్టుకోవాలి.
- బెల్లం సెనగపప్పు మిశ్రమం బయటికి రాకుండా బియ్యం పిండి తో చుట్టుకోవాలి.
- అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ మీద ఇడ్లీ కుక్కర్ లో నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి.
- తయారు చేసి పెట్టుకొన్న కుడుములు అన్ని ఇడ్లీ ప్లేట్స్ లో చక్కగా పెట్టుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్లో కుడుములు అన్ని పెట్టుకొని పది నిమిషాలు ఉడికించాలి.
- అంతే వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా పూర్ణం కుడుములు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.