హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం హెల్తీ స్నాక్స్ జీడిపప్పు తో బిస్కెట్స్ రెడీ చేసుకుందామా.
జీడిపప్పు బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.
కావలసిన పదార్థాలు:-
మైదా పిండి పావు కిలో
వెన్న- వంద గ్రాములు
బాదం పొడి- పావు కప్పు
బేకింగ్ పౌడర్ - అర చెంచా
పాలు- కొద్దిగా
పంచదార పొడి - ఒకటిన్నర కప్పు
ఉప్పు- చిటికెడు
వంట సోడా చిటికెడు
జీడిపప్పు రెండు కప్పులు
తయారు చేసే విదానం:-
- ముందుగా కావలసిన పదార్థాలు అన్ని సిద్ధం చేసుకోవాలి.
- జీడిపప్పును నేతి లో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అలాగే బాదం పప్పు ను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.
- అలాగే బాదం పప్పును కూడా మిక్సి లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- కావలసినంత పంచదార తీసుకొని మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి.
- జీడిపప్పు, బాదం పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి.
- ఇప్పుడు అందులో మైదా పిండి,బేకింగ్ పొడి,
- పంచదార పొడి ,వెన్న వేసి బాగా కలపాలి.
- చపాతీ పిండిలా ముద్ద లా కలుపుకోవాలి.
- ఒకవేళ గట్టిగా అయితే పాలు పోసుకోవచ్చు. మెత్తగా కలుపుకోవాలి.
- దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని నచ్చిన ఆకారంలో బిస్కెట్స్ తయారు చేసుకోవాలి.
- తరవాత ఓవెన్ ట్రేలో పెట్టి ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేయాలి.
- గాలి చొరనిడబ్బాలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
- అంతే రుచికరమైన హెల్తీ కాజు బిస్కెట్స్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: గోధుమ పిండి తో స్వీట్ గవ్వలు / sweet gavvalu recipe
Post a Comment
If you have any doubts, Please let me know.