హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా గోధుమ పిండి తో స్వీట్ గవ్వలు ఎలా చేయాలో చూద్దాం.
గవ్వలు:-
- గవ్వలు ఈజీ గా తొందరగా చేసుకోగలిగే స్వీట్ డిష్.
- ఎవరైనా ఇంటికి వస్తే తొందరగా చేసి పెట్టొచ్చు.పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చాలా తక్కువ వస్తువులతో ఈజీగా ఐపోతుంది.
కావలసిన పదార్థాలు:-
గోధుమ పిండి
నీళ్ళు
ఇలాచి పౌడర్
చెక్కర లేదా బెల్లం
గవ్వల పీట
నూనె
తయారు చేసే విధానం:-
- కావలసిన పదార్థాలు అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు పిండిలో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- కలిపిన పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- స్టౌ వెలిగించి గిన్నె లో ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఒక కప్పు చెక్కర వేసుకొని బాగా కలుపుకోవాలి.
- చిన్న మంట మీద నెమ్మదిగా పాకం తయారు చేసుకోవాలి.
- పాకంలో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి.
- లేత తీగ పాకం పట్టాలి.
- ఇంకోపక్క కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తో చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
- ఉండలు చాలా చిన్నగా చేసుకోవాలి. అంతే గులాబ్ జామ్ అంత సైజ్.
- ఇప్పుడు ఇంకో స్టౌవ్ మీద కడాయి లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
- చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న పిండి నీ తీసుకుని గవ్వల పీట మీద పెట్టుకొని బొటన వేలితో ముందుకు జరిపి గవ్వల్లా చేసుకోవాలి.
- ఫోటోలో చూపించినట్లు చేసుకోండి.చాలాబాగా వస్తాయి.
- గవ్వల పిత లేకపోతే మనం ఫోర్క్ పైన చేసుకోవచ్చు.లేదా చపాతీ పిత మిద కూడా చేసుకోవచ్చు.
- అన్ని చేసుకొని ఒకే సారి కాల్చుకోవచ్చు.లేదా కొన్ని కొన్ని చేసుకోవచ్చు.
- గవ్వలను నూనె లో వేసుకొని ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత గవ్వలను పాకంలో వేసుకొని ఒక అర గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- అర గంట తర్వాత గవ్వలను తీసి ఒక ప్లేటులో వేసి అరపెట్టుకోవలి.
- అన్ని అలాగే పాకం గిన్నెలో ఉండనిస్తే అన్ని అతుక్కుపోతాయి.
- ఈ గవ్వలు ఒక నెల రోజులు నిల్వ ఉంటాయి.
- అంతే రుచికరమైన స్వీట్ డిష్ గవ్వలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.