బియ్యం పిండి తో గిన్నె అప్ప (సర్వ పిండి)

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా బియ్యం పిండి తో గిన్నె అప్ప (సర్వ పిండి)ఎలా చేయాలో చూద్దాం.



sarva pindi

సర్వ పిండి:-


ఇది చాలా పాత వంటకం. ఇది మన అమ్మమ్మ, నానమ్మ కాలం నాటి వంటకం. ఒకప్పటి స్నాక్ రెసిపీ. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది.


కావలసిన పదార్థాలు:-


బియ్యం పిండి

కారం తగినంత

ఉప్పు తగినంత

నూనె సరిపడా

నీళ్లు తగినన్ని

కరేపాకు

జీలకర్ర

నువ్వులు

వేయించిన పల్లీలు

ఉల్లిపాయ ముక్కలు

పచ్చిమిర్చి

అల్లం తరుగు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్

కొత్తిమీర

నానపెట్టిన సెనగపప్పు



sarva pindi

తయారు చేసే విధానం:-


  • సర్వ పిండి చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా కట్ చేసి పెట్టుకొన్న కరేపాకు, కొత్తిమీర, సగం స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి.
  • కలిపిన తరువాత అందులో వేయించిన పల్లీలు కచ్చా పచ్చగా చేసుకొనీ వేసుకోవాలి.అలాగే నానపెట్టిన సెనగపప్పు వేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేయించి వేసుకోవాలి.
  • ఒక స్పూన్ పచ్చిమిర్చి తరుగు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి.
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
  • ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని పిండి నీ మంచిగా కలుపుకోవాలి.
  • చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
  • కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి.
  • సర్వ పిండి చేసుకోవడానికి గిన్నె తీసుకొవాలి. మనం అన్నం వండుకునే గిన్నె ఐతే అడుగు లో మాత్రమే పెట్టుకోవాలి.
  • సైడ్ పెట్టుకుంటే తొందరగా కాలదు. కాబట్టి అడుగున పెట్టుకోవాలి.
  • లేకపోతే కడాయిలో ఐన పెట్టుకోవచ్చు.
  • గిన్నె తీసుకొని అందులో అడుగున నూనె వేసి పిండి ముద్ద తీసుకొని చేతితో మనకు కావలసినంత పలుచగా పరుచుకోవాలి.
  • సర్వ పిండి కొంచెం మందం ఉంటే బాగుంటుంది.
  • ఇప్పుడు పై నుండి నూనె వేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నె స్టౌ మీద పెట్టీ బాగా కాల్చుకోవాలి.
  • వీలైతే రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన వంటకం స్నాక్ సర్వ పిండి రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️