మటన్ లాంటి మిల్మెకర్ కీమా

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా నాన్ వెజ్ తినని వాళ్లకు మటన్ లాంటి మిల్మెకర్ కీమా ఎలా చేయాలో చూద్దాం.

soya keema fry

మిల్మెకర్ :


మిల్మేకర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్టరాల్ స్థాయిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది.మిల్మకేర్ లో ఐరన్ కాల్షియం ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

కావలసిన పదార్థాలు:-

నూనె

జీలకర్ర

ఉల్లిపాయలు

కొత్తిమీర

ఉప్పు

కారం

పసుపు

అల్లం వెల్లుల్లి పేస్ట్

ధనియాల పొడి

గరం మసాలా

పుదీన

టొమాటో

తయారు చేసే విధానం:-

  • ముందుగా మిల్నేకర్ నీ నీళ్లలో నానబెట్టి పెట్టుకోవాలి.

  • ఒక అర గంట నానిన తర్వాత మొత్తం నీళ్ళు పిండేసి పెట్టుకోవాలి.

  • మిక్సి లో కీమలా చేసుకోవాలి. పొడి పొడిల చేసుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ,పచ్చి మిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.

  • తర్వాత అందులో టొమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

  • ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలి.

  • ఆ తర్వాత అందులో మీల్మేకర్ కీమా నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

  • ఐదు నిమిషాల తర్వాత ఉప్పు,తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టీ ఫ్రై చేసుకోవాలి.

  • మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.

  • చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.

  • ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది. అలాగే చపాతీలు, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది.

  • అంతే రుచికరమైన మిల్మేకర్ కీమా రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️