హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా వెజిటబుల్ పులావ్ ఎలాచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
బియ్యం రెండు కప్పులు
క్యారెట్ ముక్కలు పావు కప్పు
బఠాణీలు పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు
బీన్స్ ముక్కలు పావు కప్పు
ఆలూ ముక్కలు పావు కప్పు
పచ్చిమిర్చి
కరివేపాకు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
కారం పొడి
ధనియాల పొడి
గరం మసాలా
కొత్తిమీర కట్ట
నునె
జీలకర్ర
మసాల దినుసులు
నీళ్లు
తయారు చేసే విధానం:-
- ముందుగా కూరగాయలు కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- బియ్యం కడిగి పెట్టుకోవాలి.ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోయాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని అన్నీ వెజిటబుల్స్ వేడి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, మసాల దినుసులు ఒక దాని తరువాత మరొకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు చిటికెడు వేసి బాగా కలపాలి.
- కలిపిన తరువాత అందులో ఉడికించిన వెజిటబుల్స్ అన్ని వేసి బాగా కలిపి మూత పెట్టీ రెండు నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు ఉప్పు,కారం, ధనియాల పొడి,కొత్తిమీర,గరం మసాలా పొడి వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.
- నీళ్ళు మరిగిన తరువాత అందులో నానపెట్టుకున్న బియ్యం వేసి కలిపి మూత పెట్టుకోవాలి.
- ఎక్కువ కలపకుండా నెమ్మదిగా ఉడికించుకోవాలి.
- ఊడకడనికి ఒక అర గంట సమయం పడుతుంది.
- ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే రుచికరమైన వెజిటరియన్ పులావ్ రెడీ.
- వేడి వేడి గా సర్వ్ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది.
- దీనికి రైతా చాలా చాలా బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: టొమాటో నువ్వుల పచ్చడి
Post a Comment
If you have any doubts, Please let me know.