చామదుంపల మెంతికూర

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా చామదుంపల మెంతికూర ఎలా చేయాలో చూద్దాం.

chamadumpala menthikura

కావలసిన పదార్థాలు:-

చామ దుంపలు పావుకిలో

మెంతికూర -  సగం కప్పు

ఉల్లిపాయలు రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్

ధనియాల పొడి

కారం తగినంత

గరం మసాలా పొడి - 1/4 టీస్పూన్

నూనె - 3 టేబుల్ స్పూన్లు

ఉప్పు రుచికి తగినంత

పసుపు

కొత్తిమిర

ఎండుమిర్చి

జీలకర్ర

నీళ్ళు

తయారు చేయు విధానం:-

  • చామ దుంపలను చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
  • మెంతికూర కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • లేకపోతే ఉడికించి తొక్క తీసి ముక్కలుగా చేసుకుని పక్కన  పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె వేడి చేసి అందులో చామదుంప ముక్కలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు,కరివేపాకు,ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలపాలి.
  • ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న మెంతికూర వెసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి,వేసి ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత  చామదుంప ముక్కలు వేసి బాగా కలపాలి మూత పెట్టీ రెండు నిమిషాలు ఉడికించాలి.
  • తర్వాత కొత్తిమిర,చిటికెడు గరం మసాలా పొడి వేసి కలపాలి. ఉడికిన తర్వాత దింపేయాలి. 
  • ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.
  • గ్రేవీ కర్రీ కావాలంటే ఈ కూర లో నీళ్ళు పోసి టొమాటో వేసి చిక్కని గ్రేవీ చేసుకున్న చాలా చాలా రుచిగా ఉంటుంది.
  • అంతే రుచికరమైన వంటకం చామదుంప మెంతికూర రెఢీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: గ్రీన్ మసాలా పూరీలు


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️