హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా నాన్ వెజ్ తినని వాళ్లకు మటన్ లాంటి మిల్మెకర్ కీమా ఎలా చేయాలో చూద్దాం.
మిల్మెకర్ :
మిల్మేకర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్టరాల్ స్థాయిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది.మిల్మకేర్ లో ఐరన్ కాల్షియం ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.
కావలసిన పదార్థాలు:-
నూనె
జీలకర్ర
ఉల్లిపాయలు
కొత్తిమీర
ఉప్పు
కారం
పసుపు
అల్లం వెల్లుల్లి పేస్ట్
ధనియాల పొడి
గరం మసాలా
పుదీన
టొమాటో
తయారు చేసే విధానం:-
ముందుగా మిల్నేకర్ నీ నీళ్లలో నానబెట్టి పెట్టుకోవాలి.
ఒక అర గంట నానిన తర్వాత మొత్తం నీళ్ళు పిండేసి పెట్టుకోవాలి.
మిక్సి లో కీమలా చేసుకోవాలి. పొడి పొడిల చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ,పచ్చి మిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
తర్వాత అందులో టొమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో మీల్మేకర్ కీమా నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఐదు నిమిషాల తర్వాత ఉప్పు,తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టీ ఫ్రై చేసుకోవాలి.
మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది. అలాగే చపాతీలు, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది.
అంతే రుచికరమైన మిల్మేకర్ కీమా రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వెజిటబుల్ పులావ్
Post a Comment
If you have any doubts, Please let me know.