హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం తోట కూర పెసర పప్పు కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
తోటకూర:-
తోటకూర ఆకుకూరలలో ఒకటి తోటకూర. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్స్ ఏ, బి, సి లు ఉన్నాయి. ఇంకా ఐరన్ కూడా ఉంటుంది. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర పప్పు, తోటకూర ఫ్రై ఇంకా పులుసు కూడా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:-
తోట కూర
పెసర పప్పు
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
కొత్తిమీర
వెల్లుల్లి పేస్ట్
ఉల్లిపాయలు
పసుపు
ఉప్పు
కారం
ధనియాల పొడి
తయారు చేసే విధానం:-
- తోటకూర పెసరపప్పు ఫ్రై కి కావలసిన పదార్ధాలు అన్ని సిద్దం చేసుకోవాలి.
- ముందుగా తోట కూర కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- పెసర పప్పును బాగా కడిగి ఒక అర గంట సేపు నాన బెట్టాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగిన తరువాత అందులో జీలకర్ర ,ఎండుమిర్చి , ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఆకుకూరలలో వెల్లుల్లి పేస్టు కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
- అల్లం ఇష్టపడే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు.
- ఇప్పుడు నాన పెట్టుకున్న పెసర పప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఒక ఐదు నిమిషాల తర్వాత కట్ చేసిన తోట కూర ను వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టీ ఫ్రై చేసుకోవాలి.
- ఐదు నిమిషాల తర్వాత అందులో తగినంత కారం,ఉప్పు వేసి కలిపి మూత పెట్టీ బాగా మగ్గనివ్వాలి.
- చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన తోట కూర పెసర పప్పు కూర రెడీ.
- ఈ కూర అన్నంలోకి బాగుంటుంది. అలాగే చపాతీ, పురిలోకి కూడా చాలా బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: సెనగపప్పు పాయసం /chana dal payasam
Post a Comment
If you have any doubts, Please let me know.