హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం సెనగపప్పు పాయసం తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
సెనగపప్పు పాయసం :-
మనం చాలా రకాల పాయసాలు తయారు చేస్తాం. బియ్యం పాయసం, సేమియా పాయసం, రవ్వ పాయసం, కొబ్బరి పాల పాయసం, పాల పాయసం, పెసర పప్పు పాయసం ఇలా చాలా రకాల స్వీట్ పాయసం లు ఉన్నాయి. ఈరోజు సెనగపప్పు పాయసం నేర్చుకుందాం. ఇందులో కొన్ని నేను పోస్ట్ చేశాను. చేయనివి తప్పకుండా పోస్ట్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:-
సెనగపప్పు
బియ్యం
బెల్లం లేదా పంచదార
ఇలాచి పౌడర్
బాదం
జీడిపప్పు
కిస్మిస్
కొద్దిగా కుంకమపువ్వు
పాలు
నెయ్యి
తయారు చేసే విధానం:-
- సెనగపప్పు పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
- ముందుగా బియ్యం, సెనగపప్పు కడిగి నానపెట్టలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె లో పాలు పొసి దానికి తగినన్ని నీళ్ళు పోసి ఒక పొంగు వచ్చేవరకు కాగలి.
- తర్వాత అందులో నానపెట్టిన బియ్యం,సెనగపప్పు వేసుకొని ఉడికించాలి.
- సెనగపప్పు ఉడకడానికి టైమ్ పడుతుంది కాబట్టి కుక్కర్ లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి వేసుకోవచ్చు.
- మీరు తీసుకున్న బియ్యం సెనగపప్పు కి సరిపడా పాలు పోసుకోవాలి.
- బియ్యం, సెనగపప్పు కలిపి ఒక కప్పు ఉంటే దానికి నాలుగింతలు పాలు తీసుకోవాలి.
- లేదా మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు పోసుకొని మరిగించుకోవలి.
- ఉడికెలోపు జీడిపప్పును, కిస్మిస్, బాదం ను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- బియ్యం సెనగపప్పు 80 శాతం ఉడికిన తర్వాత అందులో బెల్లం లేదా పంచదార వేసుకొని బాగా కలపాలి.
- పాయసం అడుగంటా కుండా చూసుకోవాలి.
- ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్ వేసుకొని బాగా కలపాలి.
- చివరగా కుంకుమ పువ్వు పాలల్లో నానపెట్టి పాయసం లో పోసుకోవాలి. కుంకమపువ్వు ననాడనికి టైం పడుతుంది అందుకే ముందే నానపెట్టుకోవలి.
- కుంకుపువ్వు లేకపోయినా పర్వాలేదు.
- అంతే బాగా కలుపుకొని దించేసుకోవాలి.సెనగపప్పు కొంచెం పలుకులు ఉంటే బాగుంటుంది. కావాలంటే మరి మెత్తగా కూడా ఉడికించు కోవచ్చు.
- ఎంతో రుచికరమైన సెనగపప్పు పాయసం రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: ఉసిరికాయ పులిహోర/ usirikaya pulihora/amla rice
Post a Comment
If you have any doubts, Please let me know.