ఉసిరికాయ పులిహోర/ usirikaya pulihora/amla rice

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం ఉసిరకాయలతో పులిహోర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

ఉసిరికాయ:-

దీనిలో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు

ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.

ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.

ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

ఉసిరికాయలతో పచ్చడి కూడా చేసుకుంటారు. అది తప్పకుండా చెబుతాను.

Usirikaya pulihora


కావలసిన పదార్థాలు:-

ఉసిరికాయలు

నూనె

జీలకర్ర

ఎండుమిర్చి

కరివేపాకు

పల్లీలు

పచ్చిమిర్చి

పసుపు

ఉప్పు

మినప్పప్పు

ఉడికించిన అన్నం

సెనగపప్పు

ఆవాలు

తయారు చేసే విధానం:-

  • బియ్యం కడిగి అన్నం ఉడికించి కొద్దిగా చల్లార్చి పెట్టుకోవాలి.
  • ముందుగా ఉసిరకాయలను కట్ చేసి మిక్సి లో వేసి రసం తీసి పెట్టుకోవాలి. తీసిన ఉసిరికాయల రసం ను అన్నానికి పట్టించాలి.
  • లేకపోతే ఉసిరికాయ ను తురిమి పెట్టుకోవాలి. ఆ తురుము తో కూడా పులిహోర చేసుకోవచ్చు.
  • అన్నానికి ఉసిరికాయ తో పాటు కొద్దిగా పసుపు, ఉప్పు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు,ఎండుమిర్చి, కరివేపాకు,పచ్చి మిర్చి ముక్కలు, మినప్పప్పు,కరివేపాకు, సెనగపప్పు, పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • పోపులో కూడా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉప్పు అన్నంలో కావలసినంత వేసుకొకపోతే పోపులో కూడా కొద్దిగా వేసుకుంటే అన్నంలో బాగా కలుస్తుంది.
  • ఇప్పుడు ఈ పోపుని అన్నంలో కలుపుకోవాలి.
  • వేడి గా తినాలంటే కాసేపు రైస్ వేడి చేసుకోవచ్చు.
  • పోపు చేసుకున్న కడాయిలో అన్నం వేసి వేడిగా అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి.
  • కలపకుండా వదిలేస్తే ఉడికిన అన్నం కదా అడుగు అంటుకుపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన ఉసిరకాయలతో పులిహోర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు / Bellam kudumulu


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️