వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు / Bellam kudumulu

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్  టేస్టీ గా బెల్లం కుడుములు  ఎలా చేయాలో చూద్దాం.


బెల్లం కుడుములు  :-

బెల్లం కుడుములు  కూడా  వినాయకునికి చాలాఇష్టమైన ప్రసాదం లలో ఒకటి .ఇది అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నివేదిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.



bellam kudumulu

కావలసిన పదార్థాలు:-

నానపెట్టిన సెనగపప్పు

పచ్చి కొబ్బరి ముక్కలు  

నెయ్యి

వేడి నీళ్ళు  నీళ్ళు

బియ్యం పిండి  ఒక కప్పు

బెల్లం సగం కప్పు

ఇలచి పౌడర్ కొద్దిగా 

 

తయారు చేసే విదానం:-

  • బెల్లం కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
  • సెనగపప్పు ను ఒక గంట సేపు నానపెట్టుకోవాలి.ఇప్పుడు ఆ పప్పును కొద్దిగా ఉడికించుకోవాలి .మరి మెత్తగా కాకుండా పప్పు విరిగేటట్టు ఉడికితే చాలు.
  • స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడిచేసుకోవాలి.నీళ్ళు వేడయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నునే కానీ వేసుకోవాలి.
  • బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.అందులో  ఉడికించుకున్నసెనగపప్పు వేసుకోవాలి.చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి.
  • స్టవ్ మిద చిన్న కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసి కొద్దిగా నీళ్ళు కరిగించుకోవాలి.
  • కరిగించుకున్న బెల్లం పోసుకొని కలుపుకోవాలి.బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండిలో వేడి నీళ్ళు పోసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి.
  • కలుపుకున్న పిండిని కుడుములు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుడుములు ఆవిరి మిద ఉడికించుకోవాలి.
  • స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ లో నీళ్ళు పోసి వేడి  చేసుకొని పెట్టుకోవాలి.ఇడ్లీ ప్లేట్స్ లో కుడుములు పెట్టుకొని ఆవిరి మిద పది నిముషాలు ఉడికించుకోవాలి.
  • ఉడికిన తర్వాత దేవుడికి నివేదించండి.అంతే వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: వినాయక చవితి స్పెషల్ పులిహోర / Pulihora

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️