హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ టేస్టీ గా ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూద్దాం.
పులిహోర :-
పులిహోర ఇది కూడా వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం .ఇది ఎక్కువగా అందరు ఇంట్లో ఈజీ గా చేసే ప్రసాదం అలాగే వినాయకచవితి నాడు వినాయకుడికి నివేదిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇది చింతపండు తో ,నిమ్మకయతో చేసుకోవచ్చు.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. తప్పకుండ ట్రై చేసి టేస్ట్ చేయండి.
కావలసిన పదార్థాలు:-
ఉడికించిన అన్నం
నూనె
జీలకర్ర
ఆవాలు
పల్లీలు
సెనగపప్పు
మినపప్పు
ఎండుమిర్చి
పచ్చిమిర్చి
కరేపాకు
చింతపండు గుజ్జు
పసుపు
ఇంగువ
కొద్దిగా ఆవపిండి
తయారు చేసే విదానం:-
పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
బియ్యం కడిగి అన్నం పొడి పొడిగా వండి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.
చింతపండు నానపెట్టి పిసికి చింత పండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె కొంచెం ఎక్కువగా పోసుకొని అందులో నూనె, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, సెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరేపాకు, పసుపు, ఇంగువ, కొద్దిగా ఆవపిండి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై ఐన తర్వాత చింతపండు గుజ్జును వేసి ,తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
చింతపండు గుజ్జు బాగా మరిగించాలి. మరుగుతున్నపుడు కొద్దిగా ఆవపిండి వేసుకోవాలి.
నూనె పైకి తేలే వరకు చింతపండు గుజ్జును మరిగించాలి.
ఇప్పుడు ఉడికించిన అన్నం ను పొడి పొడిగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి.తయారు చేసుకున్న పులిహోర మిశ్రమమ ను అన్నంలో బాగా కలుపుకోవాలి.
కలిపిన వెంటనే తినకుండా ఒక అర గంట తర్వాత తింటే చాల రుచిగా ఉంటుంది.
వినాయక చవితి స్పెషల్ ప్రసాదం చింతపండు పులిహోర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వినాయక చవితి స్పెషల్ బెల్లం పాల తాలికలు/Bellam pala thalikalu
Post a Comment
If you have any doubts, Please let me know.