హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం.
చేపల పులుసు
చేపల పులుసు అంటే అందరికీ చాలా ఇష్టం.చేపలలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి.చేపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా తొందరగా ఉడికిపోతుంది. చేపలతో ఫ్రై ,పులుసు,బిర్యానీ ఇలా చాలా రకాల చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:-
చేపలు
నూనె
జీలకర్ర
మెంతులు
కరివేపాకు
చింతపండు రసం
ధనియాలపొడి
గరంమసాలా
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం
ఉప్పు
కొత్తిమీర
జీలకర్ర పొడి
తయారు చేసే విధానం:-
ముందుగా చేపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు చేపలలో ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి.
స్టవ్ వెలిగించి ఉల్లిపాయ ని ఒక పెద్ద నీడిల్ నీడిల్ కి గుచ్చి గుచ్చి స్టవ్ పైన కాల్చుకోవాలి.
అర కేజీ చేప కు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి.
చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. వెలిగించి కడాయి పెట్టుకుని జిలకర, మెంతులు, ధనియాలు, గరంమసాలా అన్నీ వేరువేరుగా ఫ్రై చేసి వేరు వేరుగా పొడిచేసి పెట్టుకోవాలి.
కాల్చిన ఉల్లిపాయను పైన పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని కావలసినంత నూనె పోసి జీలకర్ర, పోపుగింజలు వేసుకోవాలి.
ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలి.
ఒక రెండు నిమిషాలు తర్వాత చింతపండు గుజ్జుపోసి తగినంత కారం,ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి.
చింతపండు రసం మరుగుతున్నప్పుడు అందులో జీలకర్రపొడి, మెంతిపొడి, ధనియాలపొడి, గరంమసాలా అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కట్ చేసి కడిగి పెట్టుకొన్న చేపముక్కలను వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి .అంతే చేపలు ఉడికిపోతాయి.
చివరగా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర వేసుకుని దించుకోవాలి.
అంతే రుచికరమైన చేపల పులుసు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: సొరకాయ హల్వా / sorakaya halwa
Post a Comment
If you have any doubts, Please let me know.