హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం.
సొరకాయ హల్వా
సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది.
చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సొరకాయ కూర సొరకాయ తో గారెలు సొరకాయతో చారు ఇలా చాలా చేసుకోవచ్చు కానీ ఈ రోజు కొంచెం వెరైటీగా సొరకాయ స్వీట్ చేసుకుందాం .ఈరోజు సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
సొరకాయ- సగం ముక్క
పాలు- కప్పు
పంచదార- ముప్పావు కప్పు
పాల కోవా
నెయ్యి- స్పూన్
జీడిపప్పు
బాదం
కిస్మిస్
యాలకుల పొడి- చిటికెడు.
తయారు చేసే విధానం:-
సొరకాయ ముక్క చెక్కు తీసి మధ్యలోకి కోసి విత్తనాలను తీసేయాలి. ఈ ముక్కలను సన్నగా తురిమి వీటి నుంచి నీటిని పిండేయాలి.
ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి.
ఇప్పుడు అదే కడాయిలో సొరకాయ తురుము వేసి పదినిమిషాలపాటు పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించాలి.
తర్వాత పంచదార వేసి కరిగేంత వరకు కలపాలి.
ఆ తర్వాత వేడిపాలు లేదా కాచి చల్లార్చినవి పోసి తక్కువ మంట మీద దగ్గరకు వచ్చేంతవరకు కలపాలి.
చివరగా చిటికెడు యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, కిస్మిన్లను వేసి దించేయాలి.
కొద్దిగా కోవా వేసి బాగా కలుపుకోవాలి. కోవా వేసుకుంటే హల్వా మరింత రుచికరంగా ఉంటుంది.
ఈ హల్వా ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వంకాయ వేపుడు / vankaya vepudu
Post a Comment
If you have any doubts, Please let me know.