వంకాయ వేపుడు / vankaya vepudu

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా వంకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం.


వంకాయ వేపుడు


వంకాయ అంటే అందరికీ చాలా ఇష్టమైన కూరగాయలు వంకాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు .సాంబార్ మసాలా వంకాయ మసాలా వంకాయ బజ్జి ఇలా చాలా రకాల వంటలు తయారు చేసుకుంటాం .ఈరోజు మనం వంకాయతో వేపుడు చేసుకుందాం.

vankaya vepudu

కావలసిన పదార్థాలు:-

వంకాయలు 

ఉల్లిపాయ ముక్కలు 

పసుపు 

జీలకర్ర 

ఎండుమిర్చి 

కొత్తిమీర

నూనె 

పోపు గింజలు 

వెల్లుల్లి ముద్ద 

కారం 

గరం మసాలా 

ధనియాల పొడి 

ఉప్పు

కరేపాకు


తయారు చేసుకునే విధానం :-

  • ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి .

  • ఇప్పుడు అడిగినా వంకాయలు ఉల్లిపాయలు మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. 

  • కట్ చేసి అలాగే ఉంచితే అవి నల్లగా మారిపోతాయి. కాబట్టి కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని ఉప్పు నీళ్లలో వంకాయలు వేసుకోవాలి.

  • ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వేడి చేసుకోవాలి.వేడైన తర్వాత అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలి.

  • వేపుడు కాబట్టి కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవాలి .నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర ,ఎండుమిర్చి, కరేపాకు, ఎండుమిర్చి,వెల్లుల్లి తరుగు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి .

  • ఎర్రగా అయిన తర్వాత పసుపు వేసుకోవాలి .ఒక్క నిమిషం ట్రై చేసి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 

  • కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వంకాయలు దగ్గరపడే వరకు మగ్గించాలి .

  • ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.

  • మరొక ఐదు నిమిషాల తర్వాత కారం ,కూరకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై  అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

  • అంతే వేడి వేడిగా వంకాయ వేపుడు రెడీ చపాతి లోకి కానీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️