హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం వెరైటీ ఆలూ వెజిటబుల్ టిక్కి తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
ఆలూ వెజిటబుల్ టిక్కి :-
ఆలూ గడ్డ తో చాలా రకాల వంటలు మనమ చేసుకుంటాము.ఆలూ గడ్డని చాలా రకాల కూరగాయలతో కలిపి కలిపి కూరలు చేసుకుంటాము .అలాగే చాలా రకాల స్నాక్స్ కూడా చేసుకుంటాం.ఈరోజు వెరైటీ గా ఆలూ వెజిటబుల్ టిక్కి చేద్దాం.
కావలసిన పదార్థాలు:-
ఆలూ
క్యారట్
బీన్స్
గ్రీన్ బఠాణీ
రెండు స్పూన్లు శెనగపిండి
పచ్చి మిర్చి
పసుపు
నూనె
కారం
కొత్తిమీర
ఉల్లిపాయలు
జీలకర్ర
వాము
తయారు చేసే విధానం:-
- ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కూరగాయల ముక్కలు (ఆలూ, క్యారట్, బీన్స్, బఠాణీ) వేసి చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి.
- ఉడికించిన కూరగాయల ముక్కలు కొద్దిగా మేదుపుకోవలి.
- ఇప్పుడు అన్ని కూరగాయల ముక్కలు వేసి ఒక గిన్నలోకి తీసుకోవాలి. అందులో తగినంతకారం,ఉప్పు,పసుపు,వాము,జీలకర్ర కొత్తిమీర, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సెనగపిండి అన్ని బాగా కలపాలి.
- స్టౌ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె పోసి చిన్న చిన్న టిక్కి లాగా చేసుకొని పెనం పై రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి.
- టమోటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
- అంతే రుచికరమైన వెరైటీ ఆలూ వెజిటబుల్ టిక్కి రెడీ.
Also read: దొండకాయ పులుసు / Dondakaya pulusu
Post a Comment
If you have any doubts, Please let me know.