హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం దొండకాయ పులుసు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
దొండకాయ
నూనె
జీలకర్ర
ఆవాలు
ఉప్పు
కారం
మెంతులు
చింత పండు గుజ్జు
ధనియాల పొడి
పసుపు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కొత్తిమీర
ఉల్లిపాయలు
తయారు చేసే విధానం:-
ముందుగా దొండకాయ ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు విడిపోకుండా అలాగే ఉండాలి. మసాలా వంకాయ ముక్కలు లాగా ఉండాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అవాలు, ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అందులో తగినంత కారం,ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
ఒక నిముషం తర్వాత అందులో చింత పండు గుజ్జును వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
పది నిమిషాలు ఉడికించి అందులో కొద్దిగా మెంతిపొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేయాలి.
అంతే రుచికరమైన దొండకాయ పులుసు కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: చికెన్ లివర్ ఫ్రై / spicy chicken liver fry
Post a Comment
If you have any doubts, Please let me know.