పాలకూర చింతకాయ పప్పు / palakura chinthakaya pappu

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం పాలకూర చింతకాయ పప్పు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

పాలకూర పప్పు:-

పప్పు చాలా రకాలు గా చేసుకుంటాము. చాలా రకాల కూరగాయలతో కలిపి చేసుకుంటాము. పాలకూర పప్పు , దోసకాయ పప్పు…... పాలకూర పప్పు చింతకాయ తో చేసుకుందాము….

palakura chintakaya pappu

కావలసిన పదార్థాలు:-


చింతకాయ ముక్కలు అర కప్పు

కంది పప్పు  1 కప్పు

పాలకూర ఒక కట్ట

ఉల్లిపాయ  1 (సన్నగా తరిగాలి)

నూనె నాలుగు స్పూన్లు

పచ్చిమిర్చి నాలుగు

ఎండుమిర్చి రెండు

వెల్లుల్లి నాలుగు

కరివేపాకు

ఉప్పు  తగినంత

జీలకర్ర

ఆవాలు

ఇంగువ  చిటికెడు

కొత్తిమీర తగినంత

కారం తగినంత

ఉప్పు

 

తయారు చేసే విధానం:-

 

  • ముందుగా పాత్రలో కప్పు నీళ్లు పోసి చింతకాయ

  • ముక్కలు వేసి మెత్తగా ఉడకబెట్టి, మెదుపుకోవాలి.

  • మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండేసి, రసం తీసుకోవాలి.

  • కుక్కర్ లో రెండు కప్పుల నీళ్లు పోసి కంది

  • పప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి.

  • పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు,జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు

  • వేయించాలి.

  • ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

  • తగినంత కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి సరిపడా వేసుకుంటే కారం అవసరం లేదు.

  • ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయ గుజ్జు, ఉప్పు,నీటిని అందులో కలిపి, పదిహేను నిమషాలు మరిగించాలి.

  • సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వడ్డించాలి.

  • అంతే రుచికరమైన పాలకూర చింతకాయ పప్పు రెడీ. చాలా రుచిగా ఉంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️