హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం రొయ్యల వేపుడు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
రొయ్యల వేపుడు:-
రొయ్యలు ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఆహారం. ఇందులో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి.
తొందరగా వంట చేయడం అవుతుంది. చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. రొయ్యల పులుసు, రొయ్యల బిర్యానీ ఇలా చాలా…. ఈరోజు రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాం….
కావలసిన పదార్థాలు:-
రొయ్యలు అర కిలో
నిమ్మరసం ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్
నెయ్యి ఒక స్పూన్
నూనె సరిపడా
కారం తగినంత
మిరియాల పొడి చిటికెడు
రుచికి తగినంత ఉప్పు
ధనియాల పొడి
పసుపు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
తయారు చేసే విధానం:-
రొయ్యలను శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
శుభ్రపరచిన రొయ్యలకు తగినంత ఉప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా పదినిమిషాలు నానబెట్టాలి.
తర్వాత కారం, మిరియాల పొడి కూడా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై ఐన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి.
తర్వాత మంట సన్నగా పెట్టుకొని రొయ్యల్ని వేసుకొని దోరగా వేగించుకొని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
అంతే రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: తెలంగాణ స్పైసీ పచ్చిపులుసు /pachchi pulusu
Post a Comment
If you have any doubts, Please let me know.