తెలంగాణ స్పైసీ పచ్చిపులుసు /pachchi pulusu

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
ఈరోజు మనం పచ్చిపులుసు తయారు చేయడం నేర్చుకుందాం.

పచ్చి పులుసు:-

ఇది అందరికీ ఇష్టమైన , ఈజీ అయిన రసం. దీన్ని చేయడం చాలా ఈజీ.ఒక్కో ప్లేసులో ఒకలా చేస్తారు. తెలంగాణలో పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ఎక్కువగా కూరలలోకి కాంబినేషన్లో చేసుకుంటాము. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.

pachipulusu

కావలసిన పదార్ధాలు:-

చింతపండు రసం

ఉప్పు

పచ్చి మిర్చి

కారం

పసుపు

ఉల్లిపాయలు

నీళ్ళు

నూనె

జీలకర్ర

ఆవాలు

ఎండుమిర్చి

కొత్తిమీర

కరిపాకూ

తయారు చేసే విధానం:-

  • ముందుగా ఉల్లిపాయ ముక్కలు గా కట్ పెట్టుకోవాలి.

  • చింతపండు ను నీళ్లలో నానపెట్టి రసం తీసి దానికి తగినన్ని నీళ్ళు పోసి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు కారం వేయడం మానేయండి. పచ్చి మిర్చి సరిపోతుంది.

  • స్టౌ వెలిగించి మంటపై పులుసుకు సరిపడా మిరప కాయలను మంచిగా కాల్చుకోవాలి.

  • కాల్చుకున్న వాటికి సరిపడా ఉప్పు,ఉల్లిపాయ ముక్కలు కలిపి మంచిగా చేతితో మేదపాలి లేదా చిన్న రోటిలో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని చింతపడు రసం లో కలుపుకోవాలి.

  • దంచుకోవడనికి రాళ్ళ ఉప్పు వేసుకున్న బాగుంటుంది.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగిన తరువాత అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకూ, కొత్తిమీర, పసుపు వేసి బాగా కలిపి చింతపండు రసం లో కలుపుకోవాలి.

  • అంతే రుచికరమైన పచ్చి పులుసు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️