పెసర పునుగులు / pesara punugulu

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా పునుగులు చేసుకుంటుంటాం.
ఈరోజు నోరూరించే వెరైటీ పెసర పునుగులు  తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.


పెసర పునుగులు:-

పునుగులు మనం ఎక్కువగా దోస పిండి ,ఇడ్లీ పిండి,మైదా పిండి తో చేసుకునే  చిరుతిండి.తెలంగాణాలో హైదరాబాద్ లో ఎక్కువగా చేసే స్ట్రీట్ స్నాక్. పునుగులు బియ్యం, ఉరద్ పప్పు మరియు ఇతర మసాలా దినుసులతో చేసిన డీప్ ఫ్రైడ్ స్నాక్. ఈరోజు మనం పెసర పప్పు తో పునుగులు చేసుకుందాం.

pesara punugulu

కావలసిన పదార్థాలు:-

పెసరపప్పు  ఒక కప్పు

మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు

ఉప్పు రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు కొద్దిగా

రెండు పచ్చిమిర్చి

జీలకర్ర కొద్దిగా

అల్లం చిన్న ముక్క

ఉల్లిపాయ ముక్కలు

నూనె

తయారు చేసే విధానం:-

  • పెసరపప్పు, మినప్పప్పు కలిపి మూడు గంటలు నానబెట్టి నీరు వడకట్టాలి. 

  • తర్వాత పప్పుల్లో అల్లం ముక్కలు వేసి గట్టిగా పేస్టు చేసుకోవాలి. 

  • ఈ పేస్టులో ఉప్పు, ఉల్లి తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. 

  • ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని డీప్ ఫ్రై కి వేడి చేసుకోవాలి.

  • బాగా వెడైన నూనెలో తడి చేత్తో పిండిని పునుగులు గా వేసి దోరగా వేయించాలి.

  • వీటికి టొమాటో పచ్చడి మంచి కాంబినేషన్.

  • అంతే రుచికరమైన పెసర పునుగులు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️