అరిసెలు / ariselu

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా స్వీట్ లు చేసుకుంటుంటాం.
ఈరోజు నోరూరించే వెరైటీ స్వీట్ అరిసెలు తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.


ariselu

అరిసెలు:-

 

అరిసేలు తెలంగాణలో  సంక్రాంతి ఉత్సవానికి తయారుచేసిన సాంప్రదాయ స్వీట్. ఈ రెసిపీని తయారు చేయడానికి ఒక కారణం ఉంది. సంక్రాంతి ఒక పంట పండుగ. అన్ని ధాన్యాగారాలు బియ్యంతో నిండి ఉన్నాయి.కానీ తాజాగా పండించిన వరి ధాన్యాలు ఉన్నాయి. తేమ మరియు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.కాబట్టి మన పూర్వీకులు ఈ విధానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని నేర్పించారు.మరియు అరిసెలులోని నువ్వులు శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.

కావలసిన పదార్థాలు :-

బియ్యం ఒక kg

నూనె

బెల్లం ఒక kg (స్వీట్ తక్కువ కూడా వాడొచ్చు)

నీళ్లు

తయారు చేసే విధానం :-

  • ముందుగా బియ్యాన్ని ఒక రెండు గంటలు నానపెట్టుకొని ,వాటిని నీడలో ఒక ఐదు నిముషాలు ఆరపెట్టి(బియ్యంలో ఉన్న నీళ్లు పోయే వరకు ఆరపెట్టుకోవాలి మొత్తం ఎండపెట్టకూడదు ) పిండి పట్టించుకోవాలి.

  • ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి.

  • అందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి బెల్లం మొత్తం కరిగే వరకు వేడిచేసి తీగపాకం వచ్చేవరకు వేడిచేసుకోవాలి.

  • తీగపాకం వచ్చాక స్టౌ ఆఫ్ చేసి బియ్యం పిండి కొంచెం కొంచెంగ వేడిగా ఉన్న పాకంలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి .

  • ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకోవాలి గాలి తగిలితే గట్టిగ అవుతుంది .

  • ఇప్పుడు స్టౌ మీద కడయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకొని వేడిచేసుకోవాలి.

  • పిండి వేడి గ ఉన్నప్పుడే అరిసెలు చేసుకోవాలి.

  • ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకోని ఒక చిన్న కవర్ మీద నూనె రాసి అరిసెలు ఒత్తుకోవాలి.

  • వాటిని నెమ్మదిగా నూనెలో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి .

  • ఇవి చాల తొందరగా ఫ్రై అవుతాయి .చాల జాగ్రత్తగా చేసుకోవాలి.

  • లేకపోతే మాడిపోతాయి.ఫ్రై అయినా అరిసెలను చిల్లుల గంటె లోకి తీసుకోని మరొక చిల్లులగంటే పైన పెట్టి ప్రెస్ చేసి నూనెని పిండాలి.

  • వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి.

  • రెడి అయినా అరిశెలను ఒక ఐదు నిముషాలు ఆరపెట్టి డబ్బా లో స్టోర్ చేసుకోవాలి.

  • ఇవి ఒక నెల వరకు నిల్వ ఉంటాయి.

  • అంతే నోరూరించే స్వీట్ అరిసెలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️