టొమాటో సూప్ / Tomato soup

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా స్వీట్ లు చేసుకుంటుంటాం.
ఈరోజు నోరూరించే వెరైటీ టొమాటో సూప్ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం..

Tomato soup

టొమాటో సూప్:-

టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలుసు.చల్లటి వాతావరణంలో గోరు వెచ్చగా ఉండే సూప్‌ని అలా అలా తాగుతుంటే... ఒంట్లో వేడి చేరి... ఎంతో ఉపశమనం కలుగుతుంది.టమాటా సూప్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్స్ A, C, K, కాపర్, సెలెనియం ఉంటాయి. గుండె ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం, బరువు తగ్గడానికి  టమోటో సూప్ దోహదపడుతుంది.

కావలసిన వస్తువులు :-

టొమాటోలు - 4

కొత్తిమీర తరుగు - 1 టీ స్పూను

నీళ్ళు - 3 కప్పులు

పంచదార - అర టీ స్పూను

క్యారెట్ - 1

ఉల్లిగడ్డ

వెల్లుల్లి రెండు

బిర్యానీ ఆకులు - 2

మిరియాలు - 1 చిటికెడు

వెన్న లేదా నెయ్యి - 1అర టీ స్పూను

ఉప్పు - తగినంత 

తయారు చేసే విధానం:-

  • యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్ధిగా కలిగిన టొమాటో,రక్తాన్ని శుద్ధి చేయటమేకాకుండా కొలెస్ట్రాల్ ను తగ్గించి

  • హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ,విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం,

  • ఐరన్, ఫాస్పరస్,టొమాటోలో సమృద్ధిగా వున్నాయి.

  • టొమాటో, క్యారెట్, నీళ్ళు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార,

  • కుక్కర్ లో ఉడికించాలి.

  • కుక్కర్ మూడువిజిల్స్ వస్తే సరిపోతుంది.

  • మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు.

  • లేదా మిశ్రమాన్ని గ్రౌండ్ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. ప్రయింగ్ పాన్లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి.

  • సూప్ తాగే ముందు వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి తీసుకుంటే బ్రెడ్ క్రిస్పీగా వుంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️