హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం రవ్వ పులిహోర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
పులిహోర:-
పులిహోర అందరికీ చాలా ఇష్టమైన ఆహారం మరియు చాలా ఈజీ గా తొందరగా అయిపోతుంది. ఎప్పుడు బియ్యం తో అంటే అన్నంతో రకరకాల పులిహోర చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర, చింతపండు. వరైటీగా రవ్వతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
రవ్వ ఒక కప్పు(బియ్యం రవ్వ)
పచ్చిమిరపకాయలు
పల్లీలు రెండు స్పూన్లు
కరివేపాకు నాలుగు రెమ్మలు
నిమ్మకాయలు - 2
ఎండు మిరపకాయలు - 2
శనగపప్పు - 2 స్పూన్స్
మినపప్పు - ఒక స్పూన్
జీలకర్ర - అర టీ స్పూన్
పసుపు
ఉప్పు
నూనె - తగినంత
ఆవాలు
ఉల్లిపాయ ముక్కలు
తయారు చేసే విదానం :-
- స్టౌ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి.
- అందులో చిటికెడు పసుపు,కొంచెం ఉప్పు వేసి కలపాలి.
- రెండు కప్పుల నీళ్ళు మరిగిన తర్వాత అందులో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు పొడి పొడిగా వచ్చేలా ఉడికించాలి.
- ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి.
- కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలక(ర వేగాక, పల్లీలు వేసి వేయించాలి.
- ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి.
- కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వ వేసి బాగా కలపాలి.
- ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత
- ఉప్పు వేయాలి.
- వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: అరటికాయ గారెలు / Aratikaya garelu
Post a Comment
If you have any doubts, Please let me know.