అరటికాయ గారెలు / Aratikaya garelu

 హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా క్రిస్పి  అరటి గారెలు ఎలా చేయాలో చూద్దాం.


గారెలు:-

వింటే భారతమే వినాలి.తింటే ఆరోగ్యానికి మేలు చేసే గారెలు తినాలి.గారెలు రెసిపీ టిఫిన్ ఇంకా స్నాక్ లలో ఇది  ఒకటి. ఉదయం అల్పాహారం కోసం మరియు కూడా ఒక సాయంత్రం అల్పాహారం కోసం కూడా చేసుకోవచ్చు. గారెలు చాలా రకాలు చేసుకోవచ్చు.ఈరోజు అరటి కాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం.

Aratikaya garelu

కావలసిన పదార్థాలు: 

మినపప్పు - కప్పు

అరటికాయ - ఒకటి

(పొట్టు తీసి చిన్న ముక్కల్లా తరగాలి)

పచ్చిమిర్చి - మూడు,

కరివేపాకు - రెండు రెబ్బలు

అల్లం - చిన్న ముక్క

ఉల్లిపాయలు

ఉప్పు

నూనె

తయారు చేసే విధానం:-

  • మినపప్పు బాగా కడిగి మూడు నాలుగు గంటలు నానబెట్టాలి.
  • అరటికాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీలో మినపప్పు వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న అరటికాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • పిండిలో నీళ్ళు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సి జార్ లో పచ్చిమిర్చి,అల్లం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలను వేసి బరకగా రుబ్బాలి. 
  • ఇప్పుడు ఈ మిశ్రమం ను పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.
  • స్టౌ వెలిగించి కళాయి లో నూనె పోసుకొని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలి.
  • తర్వాత కొద్దిగా పిండి తీసుకొని అరచేతిలో వేసుకొని కొంచెం నీళ్ళు తడి చేసుకొని గారెల్లాచేసి, మధ్యలో చిన్న చిల్లు పెట్టి నూనెలో ఎర్రగా వేయించాలి.
  • అంతే రుచికరమైన అరటి కాయ గారెలు రెడీ. చట్నీ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: ఎగ్ బీన్స్ కూర / beans egg curry


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️