హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం చిక్కుడుకాయ టమోటా కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
ఉప్పుకారం
పసుపు చిటికెడు
ఎండు మిర్చి - 2
కొత్తిమీర
కరివేపాకు
ఆవాలు
పచ్చిమిర్చి
జీలకర్ర
చిక్కుడుకాయలు
టమోటా
ఉల్లిపాయలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
దనియాల పొడి
ఎండు కొబ్బరి పొడి
తయారు చేసే విధానం:-
చిక్కుడుకాయలు కడిగి ఈనలు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి , టమోటా కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు ,పసుపు వేసుకొని చిక్కుడుకాయలు ఉడికించుకోవాలి.
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి కాగిన తరువాత జీలకర్ర ,ఆవాలు,ఎండు మిర్చి,కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై ఐన తర్వాత పచ్చిమిర్చి ,ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు వేసుకోవాలి.
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి మూత పెట్టి టొమాటోలు మగ్గించుకోవాలి.
టొమాటోలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఐదు నిముషాలు ఫ్రై ఐన తర్వాత తగినంత ఉప్పు ,కారం,వేసి ఫ్రై చేసిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.
నీళ్ళు దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి.తర్వాత అందులో దనియాల పొడి, కొత్తిమీర,ఎండు కొబ్బరి పొడి వేసుకొని రెండు నిముషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
(అలాగే టమోటాలు బదులుగా ఆలుగడ్డ కూడా చిక్కుడు కాయలతో కలిపి వండుకోవచ్చు.
అంతే రుచికరమైన చిక్కుడుకాయ టమోటా కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. షేర్ చెయ్యండి.
Also read: ఎగ్ బీన్స్ కూర / beans egg curry
Post a Comment
If you have any doubts, Please let me know.