హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం రుచికరమైన ఎగ్ బీన్స్ కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
ఎగ్ బీన్స్ కూర:-
బీన్స్ తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు .ఆలు బీన్స్ ,బీన్స్ ఫ్రై ,బిర్యానీ ,బీన్స్ టమాటో కర్రీ ఈరోజు వెరైటీగా ఉండే రుచికరమైన ఎగ్ బీన్స్ కూర చేసేద్దాం .
కావలసిన పదార్థాలు:-
ఎగ్స్
బీన్స్
నూనె
పోపు గింజలు
ఎండు మిర్చి
ఉల్లిపాయలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
టొమాటో
ఉప్పు రుచికి సరిపడా
కారం
ధనియాల పొడి
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థాలు అన్ని సిద్దం చేసుకొని అన్ని సిద్దంగా పెట్టుకోవాలి.
బీన్స్ కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగాక అందులో ఎగ్స్ కొట్టి పోసి చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి పోపు గింజలు, ఎండు మిర్చి వేసుకోవాలి.
ఒక నిముషం తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి బాగా కలిపి ఉడికించాలి.
ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
తర్వాత అందులో ఉడికించిన బీన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ను వేసుకోవాలి.
ఒక నిముషం పాటు ఫ్రై అయ్యాక అందులో తగినంత కారం,ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి కొత్తిమీర వేసి దించేయాలి.
అంతే రుచికరమైన ఎగ్ బీన్స్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: క్యాబేజీ వడ / cabbage vada
Post a Comment
If you have any doubts, Please let me know.