హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా క్రిస్పి క్యాబేజీ వడ ఎలా చేయాలో చూద్దాం.
క్యాబేజీ వడ:-
వడ రెసిపీ టిఫిన్ ఇంకా స్నాక్ లలో ఇది ఒకటి. ఉదయం అల్పాహారం కోసం మరియు కూడా ఒక సాయంత్రం అల్పాహారం కోసం కూడా చేసుకోవచ్చు .వడలు చాలా రకాలు చేసుకోవచ్చు.ఈరోజు క్యాబేజీ వడ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు : -
మినపప్పు
సెనగపప్పు
తరిగిన క్యాబేజీ - కప్పు
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉప్పు
నూనె - తగినంత
పచ్చి మిర్చి
కొత్తిమిర
అల్లం ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
పసుపు
తయారు చేసే విదానం :-
సెనగపప్పు, మినపప్పును నానబెట్టి మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
రుబ్బుకునేటపుడుఅందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి.
క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
అలాగే ఉల్లిపాయలు,కొత్తిమిర ,కరేపాకు,అల్లం ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక గిన్నె తీసుకోని అందులో రుబ్బుకున్న పప్పు,క్యాబేజీ తరుగు, కరివేపాకు,కొత్తిమిర , ఉప్పు ,పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
ఇప్పుడు కడ్డి కొద్దిగా పిండి తీసుకోని వడలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించాలి.
అంతే రుచికరమైన క్యాబేజీ వడ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: ఎగ్ ఆవకాయ పచ్చడి / egg pickle
Post a Comment
If you have any doubts, Please let me know.