హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం ఎగ్ ఆవకాయ పచ్చడి తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
ఎగ్ ఆవకాయ పచ్చడి :-
ఎగ్ తో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలి. చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం. చింతకాయ, టమాటో, మామిడికాయ,ఉసిరికాయ, అలాగే కోడిగుడ్డు వెల్లుల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పది రోజులు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:-
ఎగ్స్
ఉప్పు
ఆవపిండి
మెంతి పిండి
జిలకర పొడి
ధనియాల పొడి
నూనె
పసుపు
కారం
నిమ్మరసం
తయారు చేసే విధానం:-
ముందుగా ఎగ్స్ ని ఒక గిన్నె లో పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.ఇప్పుడు కలిపినా గుడ్డు మిశ్రమంను చిన్న చిన్న గిన్నెలలో పోసి ఇడ్లీ కుక్కర్ లో ఆవిరి మీద ఉడికించుకోవాలి.
ఇప్పుడు చిన్న చిన్న గిన్నెలలోనుండి గుడ్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఎర్రగా అయ్యే వరకు నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి పచ్చడికి సరిపడా నూనె పోసి వేడి అయ్యాక అందులో ఆవపిండి ,మెంతి పిండి ,జిలకర పొడి ,ధనియాల పొడి ,పసుపు,కారం ,ఉప్పు వేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మసాలాలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.చల్లారాక డీప్ ఫ్రై చేసుకున్న గుడ్డు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
చివరగా నిమ్మరసం వేసుకోవాలి.ఏది ఒక రెండు వారాలు ఉంటుంది.
అంతే ఎగ్ ఆవకాయ పచ్చడి రెడీ .
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. షేర్ చెయ్యండి.
Post a Comment
If you have any doubts, Please let me know.