రవ్వ పులిహోర / ravva pulihora

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం రవ్వ పులిహోర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

పులిహోర:-

 

పులిహోర అందరికీ చాలా ఇష్టమైన ఆహారం మరియు చాలా ఈజీ గా తొందరగా అయిపోతుంది. ఎప్పుడు బియ్యం తో అంటే అన్నంతో రకరకాల పులిహోర చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర, చింతపండు. వరైటీగా రవ్వతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం.

 

ravva pulihora

కావలసిన పదార్థాలు:-


రవ్వ ఒక కప్పు(బియ్యం రవ్వ)

పచ్చిమిరపకాయలు

పల్లీలు  రెండు స్పూన్లు

కరివేపాకు నాలుగు రెమ్మలు

నిమ్మకాయలు - 2

ఎండు మిరపకాయలు - 2

శనగపప్పు - 2 స్పూన్స్

మినపప్పు - ఒక స్పూన్

జీలకర్ర - అర టీ స్పూన్

పసుపు

ఉప్పు

నూనె - తగినంత

ఆవాలు

ఉల్లిపాయ ముక్కలు

 
తయారు చేసే విదానం :-

 

  • స్టౌ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి.
  • అందులో చిటికెడు పసుపు,కొంచెం ఉప్పు వేసి కలపాలి.
  • రెండు కప్పుల నీళ్ళు మరిగిన తర్వాత అందులో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు పొడి పొడిగా వచ్చేలా ఉడికించాలి.
  • ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి.
  • కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలక(ర వేగాక, పల్లీలు వేసి వేయించాలి.
  • ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి.
  • కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వ వేసి బాగా కలపాలి.
  • ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత
  • ఉప్పు వేయాలి. 
  • వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: అరటికాయ గారెలు / Aratikaya garelu


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️