హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం చాలా రకాల పరోటా లు రెడీ చేసుకుంటూ ఉంటాం గోబీ .పరోటా,ఆలూ పరోటా,మేతి పరోటా లు చేసుకుంటాము. కాని ఈరోజు పాలకూర తో వెరైటీగా పాలక్ పరోటా తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. పాలకూర తినని పిల్లలకు చపాతీ లాంటి పరోటా లా చేసి ఇస్తే చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
పచ్చిమిర్చి నాలుగు
అల్లం పేస్ట్ - 1 టీ స్పూన్
ఉప్పు తగినంత
నీళ్లు పిండి కలపడానికి
నూనె లేదా నెయ్యి పరోటా కాల్చడానికి సరిపడా
గోధుమపిండి ఒక కప్పు
మైదాపిండి ఒక కప్పు
ఒక కట్ట పాలకూర
కొత్తిమిర కొద్దిగా
జీలకర్ర కొద్దిగా
నాలుగు స్పూన్ల పెరుగు
తయారు చేసే విధానం:-
- స్టవ్ వెలిగించి ఒక బౌల్ లో నీళ్ళు వేడి చేసుకొని అందులో పాలకూర శుభ్రం గా కడిగి వేసుకోవాలి.
- పాలకూర మెత్త బడ్డ తర్వాత తీసి మిక్సీ బౌల్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని..అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు, కొద్దిగా నునే ,నాలుగు స్పూన్ల పెరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.
- ఆ చపాతీ ముద్దకు తడివస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్నినిమ్మకాయ సైజ్ ఉండలులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారిమడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపైనెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి.
- అంతే రుచికరమైన టేస్టీ పాలక్ పరోటా రెడీ.పెరుగు తో తింటే పరోటా లు చాల బాగుంటాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: దోసకాయ మెంతికూర/ cucumber methileaves curry
Post a Comment
If you have any doubts, Please let me know.