హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం చాలా రకాల కట్ లెట్స్ లు రెడీ చేసుకుంటూ ఉంటాం .ఈరోజు పాలకూర ,ఆలుగడ్డ తో వెరైటీగా పాలక్ పొటాటో కట్ లెట్స్ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. పాలకూర తినని పిల్లలకు చపాతీ లాంటి పరోటా లా చేసి ఇస్తే చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
పాలకూర ఒక కట్ట
బంగాళాదుంపలు రెండు
పచ్చి బఠాణీలు కప్పు
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి కారానికి తగినంత
కార్న్ ఫ్లోర్ నాలుగు స్పూన్లు
సెనగపిండి ఒక స్పూను
గరం మసాలా పొడి
చాట్ మసాలా పొడి సగం స్పూను
నీళ్లు కొద్దిగా
నూనె తగినంత
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
తయారు చేసే విధానం:-
- ముందుగా బంగాళాదుంపలు చెక్కు తీసి ముక్కలు చేసి పెట్టుకోవాలి.పచ్చి బఠాణీలు కడిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్లో వేసి రెండు విసిల్స్ వచ్చే వరకు ఉడికించి కుక్కర్ లో నుండి తీసి పక్కన పెట్ట్టుకోవాలి.అలాగే కుక్కర్ ఉంచితే చాల మెత్తగా అవుతాయి.
- వెచ్చని నీళ్లలో పాలకూరను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి.
- ఉడికించిన బంగళాదుంపలు, పచ్చిబఠానీలను ముద్దగా చేయాలి. పచ్చి మిర్చి, అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక గిన్నెలో పాలకూర తరుగు , బంగాళా దుంప, పచ్చి బఠానీల ముద్ద , ఉల్లిపాయ ముక్కలు మసాలా పొడులు, ఉప్పు, సెనగపిండిని,కార్న్ ఫ్లోర్ నాలుగు స్పూన్లు వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి.
- తర్వాత చిన్న చిన్న కట్ లెట్స్ నచ్చిన ఆకారంలో చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి ఒక్కో ముద్దను వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి.ఈ కట్ లెట్స్ మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు.
- ఈ కట్ లెట్స్ కొత్తిమీర చట్నీ లేదా టమోటా కేచేప్ తో ఎంతో రుచిగా ఉంటాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: పాలక్ పరోటా / palak paratha
Post a Comment
If you have any doubts, Please let me know.