హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం చాలా రకాల టిఫిన్ లు రెడీ తయారు చేసుకుంటూ ఉంటాం. మనం ఇడ్లీ చేసుకుంటాం కానీ ఈరోజు మనం వెరైటీగా రాగి ఇడ్లీ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. అందరు చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
రాగి పిండి - 1 కప్పు,
మినపప్పు అర కప్పు,
ఇడ్లీ రవ్వ - 1 కప్పు,
ఆవాలు టీ స్పూన్,
తరిగిన పచ్చిమిర్చి - 1 టీ స్పూన్
కరివేపాకు రెమ్మలు - 3,
ఉప్పు - తగినంత
వెల్లుల్లి ఒక ఐదు
పల్లీలు
పచ్చికొబ్బరి తురుము కొద్దిగా
నూనే చట్నీ పోపు కోసం
పోపు దినుసులు
తయారు చేసే విధానం:-
- ముందుగా మినప పప్పును రెండు గంటల పాటు నానబెట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- అలాగే ఇడ్లీ రవ్వ కడిగి నీళ్ళు పోసి నానపెట్టి పెట్టుకోవాలి.
- తర్వాత ఒక గిన్నె ఇడ్లీ రవ్వ, మినపప్పు పేస్ట్, రాగి పిండి, ఉప్పు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి.
- ఇడ్లీ పిండి కనీసం నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ముందు రోజు రాత్రి చేసుకోవచ్చు.
- ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ స్టౌ మీద పెట్టుకోని అందులో ఇడ్లీ ప్లేట్లో నూనె రాసి, అందులో పిండిని వేసి స్టీమర్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అంతే రుచికరమైన మెత్తని ఇడ్లీలు రెడీ.
- ఇడ్లీ లోకి పల్లి చట్నీ చాలా చాలా బాగుంటుంది.
- వాటిని ఏదైనా చట్నీ లేదా కారంపొడితో సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ ఆల్రెడీ నేను మన బ్లాగ్ లో పోస్ట్ చేశాను.. చెక్ చేసి తప్పకుండా ప్రయత్నించండి.
మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: పాలక్ పొటాటో కట్ లెట్స్ / palak potato cutlets
Post a Comment
If you have any doubts, Please let me know.