హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం రకరకాలుగా స్వీట్ లు చేసుకుంటుంటాం.మనం ఎప్పుడు బియ్యంతో చెక్కర పొంగలి చేస్తుంటాము. ఈరోజు వెరైటీగా కొబ్బరి పాలతో చెక్కర పొంగలి ఎంతో రుచికరమైన ప్రసాదం చెక్కర పొంగలి తయారు చేసే పద్ధతి......చూద్దాం..
ఇలా చేస్తే అందరు చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
బియ్యం: అరకప్పు
బెల్లం: కప్పు
కొబ్బరి పాలు ఒక కప్పు
పాలు అరకప్పు
పచ్చి కొబ్బరి ఒక కాయ
పాలు: పావుకప్పు
యాలకులపొడి కొద్దిగా
జీడిపప్పు
బాదం పప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు
కిస్ మిస్ పలుకులు
కొద్దిగా నీళ్ళు
కొద్దిగా నెయ్యి
తయారు చేసే విధానం:-
- కొబ్బరి కాయ కొట్టి కొబ్బరి తీసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సి లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి.
- బియ్యాన్ని కడిగి ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
- స్టా వెలిగించి బియ్యం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి.బెల్లం తురిమి పెట్టుకోవాలి.
- అన్నం సగం కంటే ఎక్కువ ఉడికిన తర్వాత కొబ్బరిపాలు పోయాలి.
- మరొక చిన్న పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు,బాదం పప్పు ,కిస్ మిస్ పలుకులు వేయించుకోవాలి.
- పాలు సగం అయ్యాక బెల్లం తరుగు వేసి, స్టవ్ ని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
- ఇప్పుడు కొద్దిగా మామూలు పాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- పొంగలి పూర్తిగా దగ్గరకు అయ్యాక నేతిలో వేయించిన జీడిపప్పు,బాదం పప్పు,పచ్చి కొబ్బరి ముక్కలు, కిస్మిస్ పలుకుల్ని వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.
- డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు.
- కొబ్బరిపాల చెక్కర పొంగలి చాలా రుచిగా ఉంటుంది ..ట్రై చేయండి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: రాగి ఇడ్లీ/ Raagi Idly
Post a Comment
If you have any doubts, Please let me know.