హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం బ్యూటీ టిప్స్ నేర్చుకుందాం... ఎక్కువ ఇంట్లో ఉండే వాటితో ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.... తప్పకుండా ప్రయత్నించండి....
బ్యూటీ టిప్స్:-
ముఖ సంరక్షణ కోసం
- మొటిమలు మరియు మచ్చల తగ్గడానికి మెంతి మరియు తులసి ఆకులను తీసుకొని పేస్ట్ లా తయారుచేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖం పై మచ్చలు, మొటిమలు, టాన్, గుంతలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది
- పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై రాసుకుంటే ముఖం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి.
- చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
- ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
- పెరుగు ,సెనగపిండి,టమాటో రసం,కొద్దిగా పచ్చి పాలు అని కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకొని అరెంతవరకు పెట్టుకొని తర్వాత కడగాలి.ఏది ముఖానికి పాక్ లా పని చేస్తుంది.
బ్యూటీ టిప్స్:-
జుట్టు సంరక్షణ కోసం పెరుగు ప్యాక్....
- పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
- చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Post a Comment
If you have any doubts, Please let me know.