వంటింటి చిట్కాలు / vantinti chitkalu / cooking tips

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం కొన్ని వంటింటి చిట్కాలు నేర్చుకుందాం... ఎక్కువ ఇంట్లో ఉండే ఆడవాళ్లకు చాల ఉపయోగపడతాయి . వాటితో మన వంటలను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు.... తప్పకుండా ప్రయత్నించండి.... 

Cooking Tips

 వంటింటి చిట్కాలు:-

  • ఇడ్లీ పిండి పుల్లగా అవ్వకుండా ఉండాలంటే చిన్న అరటి ఆకును అందులో వేసి ఉంచితే సరిపోతుంది.
  • ముందుగా ఉప్పు వేసిన కూడా పిండి తొందరగా పుల్లగా అవుతుంది.కాబట్టి ఇడ్లి చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే మంచిది.
  • చపాతీలు పూరీల్లా పొంగాలంటే గోధుమపిండిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ,కొద్దిగా నూనె  కలిపితే చాలు.చాల సాఫ్ట్ గా పొంగుతాయి.
  • చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా ఉంటుంది.
  • కూర వండుకునేటపుడు  తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే కూర పోపు మాడదు.
  • కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి ఉంచితే పోషకాలు వేరు కాకుండా త్వరగా ఉడుకుతాయి.
  • కూరగాయలు, పండ్లు ,ఉడికించిన ఆహారాన్ని ఒకరోజు మాత్రమే ఫ్రిజ్లో ఉంచాలి.
  • చపాతీ పిండిలో అరటిపండు గుజ్జు కలుపడం వల్ల మెత్తగా ఉండడమే కాకుండా చాలాసేపు గట్టిపడకుండా ఉంటాయి.
  • చపాతీపిండిలో కొంచెం శనగపిండి కలిపితే మంచి రంగు,వాసన వస్తాయి.
  • దోసల పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ నానపెట్టి రుబ్బి కలిపితే దోసలు ఎర్రగా వస్తాయి.

తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️