పన్నీర్ 65 / paneer 65

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం పన్నీర్ 65 నేర్చుకుందాం... ఎక్కువ ఇంట్లో ఉండే ఆడవాళ్లకు నేర్చుకుంటే చాల ఈజీ గా పిల్లలకు చేసి పెట్టడానికి ఉపయోగపడతాయి . వాటితో మన వంటలను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు.... తప్పకుండా ప్రయత్నించండి.... 
paneer 65

కావలసిన పదార్థాలు:-


పన్నీర్ ముక్కలు

కొద్దిగా కారం

కొంచెం ఆరంజ్ ఫుడ్ కలర్

కార్న్ ఫ్లోర్ 1 కప్


మైదా 4 స్పూన్స్


ధనియాల పొడి 2 స్పూన్స్


ఆమ్ చూర్ పొడి 2 స్పూన్స్


అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్


ఉప్పు సరిపడా


నూనె వేయించడానికి సరిపడా


తయారు చేయు విధానం: -

  • ముందుగా పన్నీరు ముక్కలు వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టాలి.
  • ఒక బౌల్ తీసుకుని మైదా ,కార్న్ ఫ్లోర్ ఉప్పు,ధనియాల పొడి అల్లం, వెల్లుల్లి పేస్ట్ ,గరం మసాల, కొద్దిగా కారం, ఫుడ్ కలర్ వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి.
  • స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక ఈ పిండిలో పన్నీర్ ముంచి డీప్ ఫ్రాయ్ చెయ్యాలి అన్ని అయ్యాక పైన అమ్ చూర్ ,సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే పన్నీర్ 65 రెడీ ఇవి టమాట సాసు తో తింటే బాగుంటాయి.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️