బూంది కర్రీ / Boondhi Curry

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.

మనం రకరకాలుగా కర్రీలు చేసుకుంటుంటాం.

ఈరోజు వెరైటీ బూంది కర్రీ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

boondi curry

కావలసిన పదార్థాలు :-

నూనె

పచ్చిమిర్చి

ఉల్లిపాయలు

టమోటో

కొత్తిమీర

కరేపాకు

అల్లంవెల్లుల్లిపేస్ట్

పసుపు

జీలకర్రపొడి

కొబ్బరిపొడి

పెరుగు

కారం

ఉప్పు

నీళ్లు

బూందీ

తయారు చేసే విధానం :-

  • బూంది కర్రీ చేసుకోవడానికి ముందుగా బూంది తయారుచేసుకోవాలి. లేకపోతే బైట షాప్ లో తేచుకున్న పర్వాలేదు .
  • స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, కరేపాకు, అల్లంవెల్లుల్లిపేస్ట్, పసుపు వేసి బాగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు టమోటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.టొమాటోలు వేగిన తర్వాత తగినంత కారం, ఉప్పు, జీలకర్రపొడి, కొబ్బరిపొడి వేయాలి.
  • రెండు నిమిషాల తర్వాత బూందీ వేసి కలుపుకోవాలి.ఇప్పుడు చివరగా పెరుగు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
  • ఇంకో ఐదు నిముషాలు స్టౌ మీద ఉడికినతర్వాత కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే  వెరైటీ బూంది కర్రీ రెడి.

తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️