హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
ఈరోజు ఎంతో రుచికరమైన శనగల గోంగూర కూర తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :-
శెనగలు (కాబూలీ శెనగలు )
గోంగూర
పోపు దినిసులు
లవంగాలు
యాలకులు
మిరియాలు
ధనియాలు
ఎండుమిర్చి
జిలకర
వాము
కారం
ఉప్పు
నూనె
కొత్తిమీర
నీళ్లు
పసుపు
ఉల్లిపాయలు
అల్లంవెల్లుల్లిపేస్ట్
తయారు చేసే విధానం:-
- ముందుగా శెనగలను కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి.
- ఇప్పుడు మసాలా కోసం లవంగాలు ,యాలకులు,ధనియాలు ,ఎండుమిర్చి ,జిలకర ,వాము అన్ని కొద్దీ కొద్దిగా తీసుకోవాలి.అంటే మనం వండే కూరకు సరిపడా తీసుకోని వేయించి పొడిచేసుకొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి పోపు దినిసులు ,ఉల్లిపాయలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించి అల్లంవెల్లుల్లిపేస్ట్, పసుపు వేయాలి .
- తర్వాత కట్ చేసుకున్న గోంగూర ని వేయి కాసేపు మగ్గించాలి.
- ఇప్పుడు ఉడికించుకున్న శెనగలు వేయాలి. రెండు నిమిషాల తరువాత మనం తయారు చేసుకున్న మసాలా వేయాలి .
- ఇప్పుడు ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.తర్వాత కారం కొద్దిగా వేసుకోవాలి ముందు మసాలా లో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి అలాగే ఉప్పు తగినన్ని నీళ్లు పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి.
- చివరగా కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి అంతే శనగల గోంగూర మసాలా కూర రెడీ .
- ఇది చపాతీ ,పూరి ,అన్నం లో కి చాల సూపర్ గా ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: మామిడికాయ పులిహోర / Mango pulihora
Post a Comment
If you have any doubts, Please let me know.