హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం చిన్న పిల్లలకు నెయ్యి ముద్దపప్పు తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
నెయ్యి
జీలకర్ర
పచ్చిమిర్చి
ఉప్పు
పెసర పప్పు
బియ్యం
ఇంగువ చిటికెడు
పసుపు
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
- ముందుగా బియ్యం కడిగి మెత్తగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు పెసరపప్పును ఉడికించి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు,చిటికెడు ఇంగువ వేసి ఫ్రై చేసి పప్పులో కలపాలి.
- ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసి కలపాలి.
- పప్పు లో నీళ్ళు ఎక్కువగా వేయకూడదు.
- ఇప్పుడు ఈ పప్పు మనం మెత్తగా వండుకున్న అన్నంలో వేసి బాగా కలిపి తినిపించాలి.
- అంతే చాలా రుచిగా ఉంటుంది.
- తప్పకుండా పిల్లలకు తినిపించే ప్రతి ఆహారం మనం రుచి చూడాలి ఎలా ఉందో తెలుసుకోవాలి.
Post a Comment
If you have any doubts, Please let me know.