బెండకాయ పల్లీల వేపుడు

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా బెండకాయ పల్లీల వేపుడు ఎలా చేయాలో చూద్దాం.

ladysfinger fry

కావలసిన పదార్ధాలు:-

బెండకాయ ముక్కలు
పల్లీలు
నూనె
జీలకర్ర
వెల్లుల్లి రెబ్బలు
ఎండు మిర్చి
ఉల్లిపాయ ముక్కలు
పసుపు కొద్దిగా
ఉప్పు తగినంత
కారం
ధనియాలపొడి
కొత్తిమీర
కరివేపాకు

తయారు చేసే విధానం:-

  • బెండకాయలు,ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఎండు మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు,వెల్లుల్లి నలగొట్టి వేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో పసుపు, బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి అందులో పల్లీలు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి.
  • ఉప్పు చివరకు వేసుకోవాలి. ఉప్పు వేస్తే బెండకాయలు జి
  • జిగురుగా అవుతాయి.
  • ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన బెండకాయ పల్లీల వేపుడు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️