హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా బెండకాయ పల్లీల వేపుడు ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
బెండకాయ ముక్కలు
పల్లీలు
నూనె
జీలకర్ర
వెల్లుల్లి రెబ్బలు
ఎండు మిర్చి
ఉల్లిపాయ ముక్కలు
పసుపు కొద్దిగా
ఉప్పు తగినంత
కారం
ధనియాలపొడి
కొత్తిమీర
కరివేపాకు
తయారు చేసే విధానం:-
- బెండకాయలు,ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఎండు మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు,వెల్లుల్లి నలగొట్టి వేసుకోవాలి.
- ఇప్పుడు అందులో పసుపు, బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి అందులో పల్లీలు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి.
- ఉప్పు చివరకు వేసుకోవాలి. ఉప్పు వేస్తే బెండకాయలు జి
- జిగురుగా అవుతాయి.
- ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- అంతే రుచికరమైన బెండకాయ పల్లీల వేపుడు రెడీ.
Also read: బొబ్బట్లు (భక్షాలు)
Post a Comment
If you have any doubts, Please let me know.