సొరకాయ రసం(ఆనపకాయ చారు)

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా సొరకాయ రసం ఎలా చేయాలో చూద్దాం.

sorakaya charu

కావలసిన పదార్ధాలు:-

లేత సొరకాయ ముక్కలు
కంది పప్పు కొద్దిగా
చింతపండు రసం
ఉల్లిపాయ ముక్కలు
వెల్లుల్లి రెబ్బలు
నూనె
జీలకర్ర 
ఆవాలు 
మెంతులు చిటికెడు
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
కొత్తిమీర
కరేపాకు
పచ్చి మిర్చి ముక్కలు
టొమాటోలు ముక్కలు

తయారు చేసే విధానం:-

  • స్టౌ వెలిగించి గిన్నె తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఆవాలు, మెంతులు చిటికెడు, పచ్చి మిర్చి ముక్కలు, ఎండు మిర్చి,కరేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు పసుపు వేసి బాగా కలపాలి.
  • తర్వాత అందులో సొరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కారం, ఉప్పు,చింత పండు రసం వేసి బాగా మరిగంచాలి.
  • మరుగుతున్న చింత పండు రసం లో ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసి మరిగించాలి.
  • సొరకాయ ముక్కలు ఉడికే వరకూ మరిగించాలి.
  • చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
  • అంతే రుచికరమైన సొరకాయ రసం రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️