కావలసిన పదార్ధాలు:-
ఓట్స్
రవ్వ
రెండు స్పూన్లు మైదాపిండి
నూనె
ఉప్పు
తయారు చేసే విధానం:-
- ఓట్స్ ,రవ్వ లను కడిగి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి.
- నానిన తరువాత మిక్సీలో వేసి దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి.
- పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెండు స్పూన్ల మైదా వేసి బాగా కలపాలి .
- తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి .
- అరగంట తర్వాత బాగా కలుపుకొని పెట్టుకొని దోశలు వేసుకోవాలి .
- వేసుకున్న దోసెలు రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- ఈ దోసెలను పల్లీ చట్నీ, టొమాటో చట్నీ వేసుకుని తింటే చాలా బావుంటుంది.
- అంతే రుచికరమైన ఓట్స్ రవ్వ దోశ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.