ఇడ్లీ లోకి టేస్టీ పల్లీ కారం పొడి

హాయ్ ఫ్రెండ్స్,అందరికీ నమస్కారం.ఈరోజు మనం పల్లీ కారం పొడి తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

palli karam podi

కావలసిన పదార్థాలు:-

పల్లీలు ఒక కప్పు
ఎండు మిరపకాయలు 15
వెల్లుల్లి రెబ్బలు 8 
ఉప్పు తగినంత
నూనె
జీలకర్ర
కరేపాకు  

తయారు చేసే విధానం:-

  • ముందుగా స్టౌ వెలిగించి కళాయి లో పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మళ్లీ స్టౌ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండు మిరపకాయలు వేసి, వెల్లుల్లి, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు పల్లీలు మిక్సి లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోనీ పక్కన పెట్టుకోవాలి.
  • వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, జీలకర్ర, కరేపాకు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత తగినంత ఉప్పు వేసి రెండింటిని బాగా కలపాలి.
  • అంతే రుచికరమైన పల్లీ కారం పొడి రెడీ.


తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️