గ్రీన్ మసాలా పూరీలు

హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా గ్రీన్ మసాలా పూరీలు ఎలా చేయాలో చూద్దాం.



మసాలా పూరీలు:-

పూరీలు అంటే అందరికి చాలా ఇష్టమైన టిఫిన్ .అందరు ఈజీ గా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఇది . మసాలా పూరీలు వెరైటీ గా రుచిగా ఉంటాయి.ఒకసారి టేస్ట్ చేస్తే తప్పకుండా మళ్ళి మళ్ళి ట్రై చేస్తారు. పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేస్తారు . ఇండియాలో  చాలా ప్రాంతములలో వీటిని ఉదయపు టిఫిన్ గా  చేస్తారు. సౌత్  ఇండియాలో  అన్ని హోటళ్ళలో ఎక్కువ గా  కనిపించే టిఫిన్ ఈ పూరీ.

దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా చేసి నూనెలో వేయిస్తారు.




Masala purilu

కావలసిన పదార్థాలు:-


గోధుమ పిండి (లేదా)

పూరీ పిండి అర కిలో

ఉప్పు రుచికి తగినంత

పచ్చిమిర్చి పది

కరివేపాకు కొద్దిగా

కొత్తిమీర ఒక కట్ట

పుదీనా ఒక కట్ట

నూనె

నీళ్లు


తయారు చేసే విధానం:-

  • ముందుగా ఒక గిన్నెలో పిండి జల్లించుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పచ్చి మిర్చి, కొత్తిమీర, కరెపాకు, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సి జార్ లో పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర,కరివేపాకు, పుదీనా ఆకులను వేసి తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఈ పేస్ట్ ను మనం తీసుకున్న పిండిలో వేసుకొని అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె పోసి బాగా కలపాలి.
  • తర్వాత కావలసినన్ని నీళ్ళు పోసి పిండి నీ పూరి పిండిలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న చిన్న పూరీలు తయారు చేసుకోవాలి.
  • అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో మనం చేసుకున్న పూరీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఈ పూరీలకు ఎటువంటి కర్రీ అవసరం లేకుండా తినొచ్చు.
  • కావాలనుకుంటే రైతా తో తినొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి.
  • అంతే రుచికరమైన మసాలా పూరీలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Also read: చెక్కరపొంగలి


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️