హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
ఈరోజు రుచికరమైన పొటాటో అటుకుల రోల్స్ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
పొటాటో అటుకుల రోల్స్:-
రోల్స్ ఇది ఒక స్నాక్ రెసిపీ. ఎక్కువగా మనం పొటాటో కాంబినేషన్లో రోల్స్ చేసుకుంటాం. పొటాటో రోల్స్, బ్రెడ్ రోల్స్, పన్నీర్ రోల్, చీస్ రోల్స్ ఎలా చాలా.ఈరోజు పొటాటో అటుకుల రోల్స్ చేసుకుందాం.ఎలా చేయాలో చూసేద్దామా...
కావలసిన పదార్థాలు:-
అటుకులు 2 కప్పులు
కోడి గుడ్డు 2
బంగాళాదుంపలు రెండు
పచ్చిమిర్చ కొద్దిగా
పల్లీలు (వేయించినవి)2 టేబుల్ స్పూన్లు,
అంచూర్ పొడి చిటికెడు
గరంమసాలా కొద్దిగా
కారం తగినంత
బ్రెడ్ పొడి సగం కప్పు
ఉప్పు రుచికి సరిపడా
సూనె వేయించడానికి సరిపడా
కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారు చేసే విధానం:-
బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
అటుకుల్ని బాగా కడిగి చిల్లుల ప్లేటులో వేసి నీళ్లు పోయె వరకు ఉంచాలి.
పల్లీలు ఫ్రై చేసి మెత్తగా పొడి చేయాలి.
కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
కోడిగుడ్డు పగల కొట్టి తెల్ల సొనను బాగా గిలకొట్టాలి.
ఇప్పుడు నానబెట్టిన అటుకుల్ని మెత్తగా మెదపాలి. అందులోనే చిదిమిన బంగాళాదుంపల ముద్ద, పల్లీల పొడి, అంచూరు పొడి,తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి తురుము. సరిపడా ఉప్పు ,కారం వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకొని అర చేతిలో వేసుకొని రోల్ చేసి రోల్స్ తయారు చేయాలి.
ఈ రోలు కోడిగుడ్డు సొనలో ముంచి బ్రెడ్ పొడిలో
దొర్లించాలి.
ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
అంతే రుచికరమైన క్రంచి పొటాటో అటుకుల రోల్స్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.