హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
ఈరోజు రుచికరమైన వెల్లుల్లి కారం తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
వెల్లుల్లి కారం పోడి
వెల్లుల్లి కారం పోడి అనేది తెలంగాణ వంటకo.మసాలా మిక్స్ లేదా వెల్లుల్లి, ఎర్ర కారం మరియు ఉప్పుతో చేసిన పొడి. ఈ కారం పొడి తయారు చేయడం చాలా సులభం మరియు చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.వివిధ కూరలలో మసాలా మిశ్రమంగా దీనిని ఉపయోగించవచ్చు. నెయ్యి లేదా నూనెతో కలిపి వేడి వేడి అన్నంలో తినొచ్చు.ఇడ్లీ లేదా దోసతో కూడా తినొచ్చు.
ఈ కారం పొడి వల్ల జలుబు ,దగ్గు తగ్గుతాయి.అలాగే దిన్నివేల్లుల్లి కారం కర అని కూడా అంటారు .డెలివరీ ఐన తర్వాత బాలింతలకు తినిపిస్తారు .
కావలసిన పదార్థాలు:-
వెల్లుల్లి రెబ్బలు (garlic)
దనియాలు ( coriander seeds)
మినపప్పు ( black gram)
ఎండుమిర్చి( dry chillies)
ఉప్పు( salt)
మిరియాలు(black pepper)
తయారు చేసే విధానం :-
- ముందుగా స్టౌ వెలిగించి కడాయి పెట్టి ఎండుమిరపకాయలను వేయించి చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ లో వెల్లుల్లి రెబ్బలు ,ఎండుమిర్చి ,తగినంత ఉప్పు ,మిరియాలు ,మినపప్పు వేయించి వేసుకోవాలి.
- ఇప్పుడు అన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం రెడి.
- దీన్ని వేడి వేడి అన్నంలో తిన్న ,ఇడ్లీ లలో తిన్న చాలా సూపర్ గా ఉంటుంది.
- తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.
మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.