పెరుగుతో పులుసు(మజ్జిగ పులుసు)/majjiga pulusu

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం మజ్జిగ పులుసు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

పెరుగుతో పులుసు (మజ్జిగ పులుసు):-

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పెరుగుతో పులుసు (మజ్జిగ పులుసు) ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి.


 

majjiga pulusu

కావలసిన పదార్థాలు:-

చిక్కని పెరుగు

రెండు స్పూన్లు సెనగ పిండి

నూనె

పచ్చిమిర్చి

జీలకర్ర

ఆవాలు

ఉల్లిపాయలు

కరివేపాకు

కొత్తిమీర

పసుపు

కారం

ఉప్పు

తయారు చేసే విధానం:-

  • ముందుగా కావలసిన పదార్థాలు సిద్దం చేసుకోవాలి.
  • పెరుగును గిలకొట్టి అందులో తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు,  కారం వేసుకోని  పక్కన పెట్టుకోవాలి.
  •  రెండు స్పూన్లు సెనగపిండి ఉండలు లేకుండా నీళ్ళలో  కలపాలి. 
  • ఇప్పుడు స్టౌ వెలిగించి కడాయిలో  నూనె పోసి వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి ,పచ్చిమిర్చి, పసుపు, వేసి ఫ్రై చేసుకోవాలి.
  • పోపు వేగిన తర్వాత అందులో మజ్జిగను పోసి ఒక పది నిమిషాలు మరిగించాలి.
  • మరుగుతున్న మజ్జిగలో కలిపి పెట్టుకున్న సెనగపిండి ని పోసుకొని కలపాలి.ఒక రెండు నిముషాలు కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుకుపోతుంది.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి.చివరగా కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి.
  • అంతే రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ.ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️